రోబో చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. అలాగే ఇటీవల విడుదలై సంచలనం సృస్టిస్తున్న ‘ఈగ’ సృష్టికర్త రాజమౌళికి సైతం దక్షిణాదిలో పేరుప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ లో ఓ చిత్రం వస్తే? అది సంచలనమే అవుతుందని చెప్పనక్కరలేదు. చిత్రం ప్రారంభమైతే ప్రక్షకుల్లో ఉత్కంఠే. అయితే అందుకు ఇంకెంత సమయం పట్టదని సమాచారం.
తమిళంలో ‘నాన్ ఈ’ పేరుతో విడుదలైన ఈగతో ప్రయోగం చేసి కమర్షియల్ హిట్ సాధించిన గొప్ప టెక్నీషియన్ గా రాజమౌళికి గుర్తింపు దక్కింది. మొన్నటి వరకు రోబో ఫేం శంకర్ ప్రశంసలే పొందిన రాజమౌళి తాజాగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఆ చిత్రం చూసి ఉబ్బితబ్బిబై ప్రశంసల జల్లు కురిపించాడు దర్శకుడిపై. ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో రాజమౌళి దర్శకత్వంలో రజనీ నటిస్తారని తమిళనాడులో ప్రచారం ఊపందుకుంది. కాగా రూ. 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రానికి రాజమౌళి ఇప్పటికే కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: